Telangana: తెలంగాణ కోర్ కమిటీ భేటీకి అందని ఆహ్వానం.. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ విజయశాంతి!

  • నిన్న గోల్కొండ హోటల్ లో కోర్ కమిటీ భేటీ
  • విజయశాంతికి ఆహ్వానం పంపని కాంగ్రెస్ నేతలు
  • తాను సాధారణ కార్యకర్తను మాత్రమేనన్న విజయశాంతి

హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీకి స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి గైర్హాజరు అయ్యారు. దీంతో విజయశాంతి ఎందుకు రాలేదని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో విజయశాంతి ఈ వ్యవహారంపై ఫేస్ బుక్ లో స్పందించారు. అసలు కోర్ కమిటీ సమావేశం జరుగుతున్నట్లు తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు.

‘గోల్కొండ హోటల్ లో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదని మీడియా వాళ్లు నన్ను అడుగుతున్నారు. కోర్ కమిటీ సమావేశం గురించి నాకు తెలియదు. సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రచార కమిటీ చైర్మన్ అయిన నా పాత్ర ఎన్నికల వరకే పరిమితం. ప్రస్తుతం నేను సోనియాగాంధీ గౌరవించి కండువాకప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్న కార్యకర్తను మాత్రమే’ అని పోస్ట్ చేశారు.

Telangana
Congress
core committee
angry
Facebook
  • Loading...

More Telugu News