jagan: ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగన్

  • అవినీతి, అక్రమాలు, దోపిడీలకు దూరంగా ఉండండి
  • తప్పు చేస్తే ఉపేక్షించను
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయండి

ఎమ్మెల్యేలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి, అక్రమాలకు, దోపిడీకి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా వీటికి పాల్పడితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అండ ఉండదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి పెద్దవారైనా, ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు.

కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకులు పని చేయాలని చెప్పారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించాలని చెప్పారు.

jagan
warning
mla
ysrcp
  • Loading...

More Telugu News