Virat Kohli: మ్యాచ్ లో 'అతి' చేశాడంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా
- ఆఫ్ఘన్ తో పోరులో అంపైర్ ముందు రెండు చేతులు జోడించిన కోహ్లీ
- తీవ్రంగా పరిగణించిన వరల్డ్ కప్ నిర్వాహకులు
- లెవల్ 1 తప్పిదంగా గుర్తింపు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భావోద్వేగాలు అణచుకోలేడన్న సంగతి అందరికీ తెలిసిందే. మైదానంలో కోహ్లీ హావభావాలు ఎంతో దూకుడుగా ఉంటాయి. తన బౌలర్లు వికెట్ తీసినప్పుడు కోహ్లీలో కనిపించే ఆవేశం అంతాఇంతా కాదు. ఇప్పుడా ఆవేశం జరిమానాకు కారణమైంది. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఓ అప్పీల్ విషయంలో మరీ అతిగా వ్యవహరించాడంటూ వరల్డ్ కప్ నిర్వాహకులు జరిమానా వడ్డించారు. ఓ ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ అలీమ్ దార్ దిశగా దూసుకుపోయిన కోహ్లీ రెండు చేతులు జోడించి మరీ అప్పీల్ చేయడాన్ని ఐసీసీ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. ఐసీసీ నియమావళి ప్రకారం లెవల్ 1 తప్పిదంగా భావించి కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు.