Andhra Pradesh: ఒకవేళ బీజేపీ వాళ్లు అలాంటి మాటలు మాట్లాడితే తప్పే: సుజనా చౌదరి

  • చంద్రబాబుని అవినీతి కేసుల్లో ఇరికించాలని బీజేపీ చూస్తోందా?
  • అలా ఎవరూ మాట్లాడిన ‘అది తప్పే’
  • బాబుపై ఎలాంటి అవినీతి కేసులు లేవు

 అధికారం కోసమో, మరి దేనికోసమో తాను బీజీేపీలో చేరలేదని, తనుకు ఈ పార్టీలో చేరాలనిపించి చేరానని సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. ‘టీవీ9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని ఏదో ఓ రకంగా అవినీతి కేసుల్లో ఇరికించాలని బీజేపీ చూస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతగా మీరు సహకరిస్తారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఒకవేళ బీజేపీ నాయకులు ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడితే తన ఉద్దేశం ప్రకారం ‘అది తప్పే’ అని అన్నారు. తొమ్మిదేళ్లు చంద్రబాబు సీఎంగా చేశారు, ఆయనపై ఎటువంటి అవినీతి కేసులు లేవని అన్నారు. చంద్రబాబుని అవినీతి కేసుల్లో ఇరికించాలని బీజేపీ చూస్తోందని అసలు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.  

Andhra Pradesh
Telugudesam
Chandrababu
bjp
sujana
  • Loading...

More Telugu News