Amarnath Reddy: టీడీపీలో అసంతృప్తులు మొదలయ్యాయి.. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే: అమరనాథ్‌రెడ్డి

  • అన్నిటికీ సిద్ధంగా ఉండాలి
  • 4 వేల మందిని తయారు చేసే శక్తి ఉంది
  • నలుగురు ఎంపీలు పోతే నష్టం లేదు

మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి టీడీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలే తప్ప, అధైర్య పడకూడదని పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేందుకు కృషి చేశారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన విషయమై అమరనాథ్ రెడ్డి స్పందిస్తూ, నాలుగు వేల మందిని తయారు చేసే శక్తి టీడీపీకి ఉందని నలుగురు ఎంపీలు పోతే నష్టం లేదని వ్యాఖ్యానించారు. జన్మభూమి కమిటీల కారణంగా పార్టీలో అసంతృప్తులు మొదలయ్యాయని ఇక మీదట పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమపై ఉందని అమరనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Amarnath Reddy
Telugudesam
Rajyasabha MP
BJP
Cadre
  • Loading...

More Telugu News