Rajasthan: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. గుడారాలు కూలి 14 మంది మృతి!

  •  భారీ వర్షం, గాలుల వల్లే ఘటన
  • ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం గుడారాల ఏర్పాటు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాడ్ మెర్ జిల్లా జాసోల్ ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం వేసిన గుడారాలు కూలి 14 మంది మృతి చెందగా, మరో 50 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సాయంతో కూలిపోయిన గుడారాలను తొలగిస్తున్నారు. భారీ వర్షం, గాలుల వల్లే గుడారాలు కూలినట్టు పోలీసులు చెబుతున్నారు.

Rajasthan
jasol
spiritual
programmes
  • Loading...

More Telugu News