Mithali Chandole: అర్థరాత్రి మహిళా జర్నలిస్టుపై రెండు రౌండ్ల కాల్పులు.. కోడిగుడ్లతో దాడి

  • తన కారులో వెళుతున్న మిథాలి
  • వాహనాన్ని ఓవర్‌టేక్ చేసిన దుండగులు
  • మాస్కులతో గుర్తించలేకపోయిన మిథాలీ

మహిళా జర్నలిస్టుపై శనివారం అర్థరాత్రి కాల్పులు జరిపి కోడిగుడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది. నోయిడాలో నివసించే మిథాలీ చండోలే అనే మహిళా జర్నలిస్ట్ తన కారులో వెళుతున్నారు. ఆమె తూర్పు ఢిల్లీలోని అశోక్‌నగర్ వసుంధర ఎన్‌క్లేవ్ వద్దకు రాగానే, మారుతి స్విఫ్ట్‌లో వచ్చి దుండగులు ఆమె వాహనాన్ని ఓవర్‌టేక్ చేసి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.

అనంతరం ఆమెపై కోడిగుడ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు మాస్కులు ధరించి ఉండటంతో ఆమె వారిని గుర్తించలేకపోయారు. ప్రస్తుతం మిథాలి తూర్పు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Mithali Chandole
Delhi
Noida
Eggs
Maruthi Swift
Private Hospital
  • Loading...

More Telugu News