South Africa: కేవలం ఆవలించా.. నేనేమీ నేరం చెయ్యలేదు: సర్ఫరాజ్

  • ఆవలింత ఎవరికైనా సహజం
  • ఆవలింత వస్తే ఏమీ చెయ్యలేం
  • జనాలే చాలా పెద్ద విషయం చేశారు

ప్రపంచ కప్ క్రికెట్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ ఆవలించడం వివాదాస్పదంగా మారింది. దీనిని ముఖ్యంగా పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా సర్ఫరాజ్ ఆవలింత ఫోటోపై వేలాదిగా మీమ్స్ వైరల్ అయ్యాయి.

ఈ విషయమై సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు ముందు సర్ఫరాజ్ స్పందించాడు. తాను కేవలం ఆవలించానని, అది ఎవరికైనా సహజమని, తానేమీ నేరం చేయలేదన్నాడు. ఆవలింత వస్తే ఏమీ చేయలేమని కానీ దీనిని జనాలు చాలా పెద్ద విషయం చేసి, దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నారన్నారు. తన మూలంగా కొందరికి మంచి జరుగుతుందంటే అది సంతోషమేనన్నాడు.

South Africa
Sarfaraj
India-pak
World Cup
Social Media
Mems
  • Loading...

More Telugu News