Padmaja: ఉద్యోగాలిప్పిస్తానని రూ.కోట్లలో వసూలు చేసి మాయమైన మహిళను ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు

  • లక్షల రూపాయలను కట్టబెట్టిన నిరుద్యోగులు
  • కలెక్టర్ సహా ఉన్నతాధికారులందరి సంతకాల ఫోర్జరీ
  • నకిలీ ఆర్డర్ కాపీలను తయారు చేయించింది

ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను నిలువునా ముంచేసిన మాయ లేడి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. శ్రీకాకుళం జిల్లా బొంత కోడూరుకు చెందిన పద్మజ ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు వల విసిరింది. దీంతో ఆమె మాటలు నమ్మిన నిరుద్యోగులు లక్షల రూపాయలను కట్టబెట్టారు. కలెక్టర్ సహా ఉన్నతాధికారులందరి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఆర్డర్ కాపీలను తయారు చేయించింది. దాదాపు పది కోట్ల వరకూ నిరుద్యోగుల నుంచి వసూలు చేసి మాయమైంది. దీంతో ఆమె కారణంగా మోసపోయిన వారంతా పోలీసులను ఆశ్రయించారు. నేడు ఎట్టకేలకు పద్మజను పోలీసులు అరెస్ట్ చేశారు.

Padmaja
Government Job
Collector
Srikakulam
Police
Fake Order Copies
  • Loading...

More Telugu News