Andhra Pradesh: ప్రజా వేదిక అంశాన్ని ప్రభుత్వం వివాదంగా మార్చింది: టీడీపీ నేత కళా వెంకట్రావు

  • ఎందుకు వివాదం చేస్తోందో అర్థం కావట్లేదు?
  • చంద్రబాబు లేఖకు ప్రభుత్వం స్పందించలేదు
  • ప్రజావేదిక తమకు అవసరం ఉందని ప్రభుత్వం చెప్పొచ్చుగా?

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీనిని స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, ప్రజావేదిక అంశాన్ని ప్రభుత్వం వివాదాంగా మార్చిందని ఆరోపించారు. దీన్ని ప్రభుత్వం ఎందుకు వివాదం చేస్తోందో అర్థం కావట్లేదని అన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా ప్రజావేదికను తమకు కేటాయించాలని చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రజావేదిక ప్రభుత్వానికి అవసరం ఉందని చెబితే ఏ గొడవా ఉండేది కాదని అన్నారు. తమకు చెప్పకుండా, ఎటువంటి లేఖ రాయకుండా ప్రజావేదికలో ఉన్న వస్తువులను వర్షంలో  పడేసి వివాదాస్పదంగా మార్చారని  ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Andhra Pradesh
Telugudesam
kala venkatarao
Chandrababu
  • Loading...

More Telugu News