Fire Accident: పత్తి గోదాములో అగ్నిప్రమాదం...రూ.15 కోట్ల ఆస్తి నస్టం
- నాగర్‌కర్నూల్‌కొల్లాపూర్ చౌరస్తాలోని బాలాజిగోదాములో ఘటన
- గోదాము మొత్తానికి నిప్పంటడంతో 960 టన్నుల బేళ్లు దగ్ధం
- విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం
తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ పత్తిగోదాములో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పట్టణ సమీపంలోని బాలాజీ గోదాములో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో రూ.15 కోట్ల ఆస్తి నస్టం సంభవించింది. కొల్హాపూర్ చౌరస్తా సమీపంలోని ఓ గోదాములో తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. గుర్తించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో గోదాములో ఉన్న పత్తిబేళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 960 టన్నుల బేళ్లు దగ్ధం కావడంతో సుమారు రూ.15కోట్లు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి నాలుగు అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపుచేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి కాటన్ మిల్లులకు చెందిన పత్తి బేళ్లను గోదాములో నిల్వచేసుకున్నట్లు యజమాని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.