electrical employees: విద్యుత్ చౌర్యం చేస్తున్నారని ప్రశ్నించినందుకు దాడి...గాయపడిన ఉద్యోగులు
- కామారెడ్డి జిల్లా మద్నూర్ మండం సోమూరు గ్రామంలో ఘటన
- చౌర్యానికి పాల్పడుతున్న ఇళ్లను గుర్తించి వీడియో తీస్తున్న సిబ్బంది
- దాడికి పాల్పడిన ఓ కుటుంబం
విద్యుత్ చౌర్యానికి పాల్పడడమేకాక దాన్ని గుర్తించి ప్రశ్నించిన విద్యుత్ సిబ్బందిపై ఓ కుటుంబం దాడికి పాల్పడిన ఘటన ఇది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూరు గ్రామంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు...గ్రామంలోని కొన్ని ఇళ్లలో విద్యుత్ చౌర్యం జరుగుతోందని గుర్తించిన విద్యుత్ సిబ్బంది ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో పరిశీలనకు వెళ్లారు. కొన్ని ఇళ్లలో వారు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని గుర్తించి వారిని ప్రశ్నించారు. అనంతరం ఆ ఇళ్లను సెల్ఫోన్లో వీడియో, పొటోలు తీస్తుండగా ఓ కుటుంబానికి చెందిన సభ్యులంతా ఒక్కసారిగా విద్యుత్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దడంతో పాటు కర్రలతో దాడిచేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దుక్కల్ సబ్ ఇంజనీర్ నవీన్‌కుమార్ తలకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఐదుగురు సిబ్బందికి స్వ్గల్ప గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకున్న సిబ్బంది మజ్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.