Tamil Nadu: వెంటపడిన ఆవు...పరుగు తీసిన మంత్రి

  • కుంభకోణం కుంభేశ్వరన్‌ ఆలయంలో ఘటన
  • యాగం సందర్భంగా ఆవు దూడకు పూజలు
  • జనాన్ని చూసి బెదిరిపోయిన గోమాత

జనాన్ని చూస్తే మూగ జీవాలు హడలిపోతాయి. ఈ విషయాన్ని గుర్తించకుండా హడావుడి చేస్తే రాజైనా, మంత్రయినా పరుగు పెట్టాల్సిందే. నిన్న ఓ గోమాత వెంట పడడంతో సాక్షాత్తు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి భయంతో పరుగు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే...కుంభకోణంలోని కుంభేశ్వరన్‌ ఆలయంలో శనివారం యాగం జరిగింది.  ఇందులో వ్యవసాయ శాఖా మంత్రి దురైకన్ను, అన్నాడీఎంకే నిర్వాహకులు పాల్గొన్నారు. యాగ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఓ ఆవుదూడను ధ్వజస్తంభం వద్దకు తెచ్చి గోపూజకు ఏర్పాట్లు చేశారు. పూజల్లో పాల్గొనేందుకు మంత్రి దురైకన్ను రాగా, ఆయన వెంట మరో వంద మంది ఒక్కసారిగా రావడంతో ఆవు బెదిరిపోయి పరుగందుకుంది. తన వైపు దూసుకు వస్తున్న ఆవును చూడగానే మంత్రి భయంతో పరుగు తీశారు. ఈ ఘటనలో మంత్రికి తృటిలో ప్రమాదం తప్పినా ఓ అన్నాడీఎంకే కార్యకర్త మాత్రం తీవ్రంగా గాయపడ్డారు.

Tamil Nadu
kubhakonam
minister
cow raiding
  • Loading...

More Telugu News