Andhra Pradesh: ఐదుగురు ఐపీఎస్ లకు రెండు వారాల్లో రెండో ట్రాన్స్ ఫర్... ఏపీలో 22 మంది బదిలీ!
- 15 రోజుల వ్యవధిలో 47 మంది బదిలీ
- ఈ నెల 5న 26 మంది ఐపీఎస్ లకు స్థానచలనం
- తాజాగా మరో 22 మంది బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నెల 5వ తేదీన 26 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన జగన్ సర్కారు, ఇప్పుడు మరో 22 మందిని ట్రాన్స్ ఫర్ చేయడంతో, 15 రోజుల వ్యవధిలో 48 మంది ఐపీఎస్‌లు బదిలీ అయినట్లయింది.
కాగా, గతంలో బదిలీ అయినవారిలో ఐదుగురు మరోసారి బదిలీ కావడం గమనార్హం. ఇక తాజా బదిలీలలను పరిశీలిస్తే, టీడీపీ ప్రభుత్వంలో శాంతిభద్రతల కో ఆర్డినేషన్ ఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ ను తొలుత అనంతపురం పీటీసీకి బదిలీ చేయగా, ఇప్పుడాయన్ను అక్కడి నుంచి తప్పించి, పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఆయనతో పాటు ఐపీఎస్ ఆఫీసర్లు కోయ ప్రవీణ్, జీవీజీ అశోక్ కుమార్, సర్వ శ్రేష్ట త్రిపాఠి, జీ పాల్ రాజ్, ఎస్కేవీ రంగారావు, ఎస్ హరికృష్ణ, కేవీ మోహన్ రావు, విక్రాంత్ పాటిల్ తదితరులు బదిలీ అయిన వారిలో ఉన్నారు.