Jagan: వైఎస్ కుటుంబాన్ని నమ్మితే అంతే... 6,770 కిలోమీటర్లు నడిచిన డాక్టర్ కు జగన్ కీలక పదవి!

  • గతంలో షర్మిలతో పాటు పాదయాత్ర
  • తాజాగా జగన్ తోనూ అడుగులు
  • స్పెషల్ ఆఫీసర్ గా నియామకం

ఆయన ఓ చిన్న పిల్లల డాక్టర్. పేరు హరికృష్ణ. వైఎస్ కుటుంబంమంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే, వైఎస్ షర్మిల చేసిన పాదయాత్రలో 3,112 కిలోమీటర్లు నడిచిన ఆయన, వైఎస్ జగన్ పాదయాత్రలో 3,648 కిలోమీటర్లూ నడిచారు. తమ కుటుంబాన్ని నమ్మిన వారికి అన్యాయం చేయబోరన్న పేరున్న వైఎస్ జగన్, ఆయన్ను ఇప్పుడు కీలక పదవిలో నియమించారు. ఏకంగా తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా పని చేసే అవకాశాన్ని హరిషృష్ణకు కల్పించారు.

అనంతపురం జిల్లా కొత్తచెరువులో చిన్న పిల్లల క్లీనిక్‌ ను నడిపించే డాక్టర్‌ హరికృష్ణ, వైద్య వృత్తిలో కొనసాగుతూనే, వైఎస్‌ కుటుంబంపై అపరిమిత అభిమానాన్ని చూపించేవారు. దాదాపు రెండేళ్ల క్రితం జగన్ పాదయాత్రను ప్రారంభించగా, ఆయన అడుగులో అడుగేశారు. ప్రజలు జగన్‌ కు ఇచ్చే వినతులను ఆయనే స్వీకరించారు. పాదయాత్రలో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. జగన్‌ కు అందుబాటులో ఉంటూ, కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే, ఆయనకు అందించేవారు.

పాదయాత్ర ముగిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, హరికృష్ణను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో తమ ప్రాంతానికి చెందిన డాక్టర్ కు కీలక హోదా లభించిందని కొత్తచెరువు ప్రాంత వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Jagan
Sharmila
Harikrishna
Padayatra
Special Officer
  • Loading...

More Telugu News