Cricket: బాల్స్ మిగిలివున్నా 5 పరుగల తేడాతో ఓటమి... వలవలా ఏడ్చిన విండీస్ క్రికెట్ ఫ్యాన్స్!

  • మాంచెస్టర్ వేదికగా విండీస్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్
  • తన జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లిన బ్రాత్ వైట్
  • సిక్స్ కొట్టి మ్యాచ్ ని ముగించాలని చూసి అవుట్

ఎలాగూ ఓడిపోతారనుకున్నారు. అయితే, పరిస్థితి మారింది. 292 పరుగులు చేయాల్సివుండగా, 7 వికెట్ల నష్టానికి 164 పరుగుల దశ నుంచి, 7 బంతుల్లో 6 పరులు చేస్తే విజయం సాధ్యమన్న స్థితికి వచ్చిన జట్టు ఓడిపోతే... నిన్న మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ పరిస్థితి ఇదే.

వెస్టిండీస్‌ కథ ముగిసిందనుకున్న సమయంలో కార్లోస్‌ బ్రాత్‌ వైట్‌ అనూహ్యంగా పోరాడాడు. కివీస్‌ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ, తన జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. 7 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన సమయంలో, సిక్సర్‌ కోసం ప్రయత్నించి, అవుట్ కాగా, మైదానంలో ఉన్న వెస్టిండీస్ అభిమానుల గుండె బద్ధలైంది. ఎంతో మంది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకోవడం కనిపించింది.

ఈ మ్యాచ్ గెలిస్తేనే సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చన్న స్థితిలో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా, న్యూజిలాండ్ కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్, (154 బంతుల్లో 14 ఫోన్లు, ఒక సిక్స్ తో 148 పరుగులు)తో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 291 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.

ఓపెనర్ గా బరిలోకి దిగిన క్రిస్ గెయిల్ 84 బంతుల్లో 87 పరుగులు చేసి రాణించగా, హెట్‌ మెయర్‌ 45 బంతుల్లోనే 54 పరుగులు చేయడంతో విండీస్ గెలుపు దిశగానే అడుగులు వేసింది. భారీ షాట్లతో వీరిద్దరూ స్కోర్ బోర్డ్ ను ఉరకలెత్తించారు. హోప్, పూరన్ లను స్వల్ప వ్యవధిలోనే అవుట్ చేసిన బౌల్ట్, ఆపై చివరిలోనూ రాణించాడు. దీంతో విండీస్ గెలుపు అవకాశాలు క్లిష్టమయ్యాయి. ఆ సమయంలో వచ్చిన బ్రాత్‌ వైట్‌ అసాధారణంగా పోరాడాడు. 245 స్కోరు వద్ద 9వ వికెట్‌ పడిపోయినా తగ్గలేదు. 49వ ఓవర్ లో నీషమ్‌ బౌలింగ్‌ లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి, బౌండరీ వద్ద బౌల్ట్‌ కే క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.

  • Loading...

More Telugu News