Manish: బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిని హత్య చేసిన న్యాయవాది మృతి

  • మనీశ్‌తో కలిసి సివిల్ కోర్టుకు వెళ్లిన దర్వేష్
  • దర్వేష్‌ను గన్‌తో కాల్చి చంపిన మనీశ్
  • తనను తాను కాల్చుకున్న మనీశ్

ఇటీవల బార్ కౌన్సిల్ తొలి మహిళా అధ్యక్షురాలు దర్వేష్ సింగ్‌ను హత్య చేసిన ఆమె సహ న్యాయవాది మనీశ్ శర్మ చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దర్వేష్ బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అయితే తనను గెలిపించిన ఇతర న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపేందుకు మనీశ్ శర్మతో కలిసి సివిల్ కోర్టుకు వెళ్లింది.

అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సహనం కోల్పోయిన మనీశ్, తన వద్ద ఉన్న గన్‌తో దర్వేష్‌ను కాల్చి చంపేశాడు. అనంతరం తన తలకు తుపాకీ గురి పెట్టుకుని కాల్చుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో కన్ను మూసినట్టు వైద్యులు ప్రకటించారు.

Manish
Darvesh
Gun
Koma
Bar Councle
  • Loading...

More Telugu News