Telugudesam: గుంటూరు జిల్లాలో అధికార, విపక్ష కార్యకర్తల మధ్య దాడి.. టీడీపీ కార్యకర్తలకు గాయాలు

  • జీజీహెచ్‌లో టీడీపీ కార్యకర్తలకు చికిత్స
  • పరామర్శించిన నక్కా ఆనందబాబు
  • ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్

గుంటూరు జిల్లాలో అధికార, విపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బొల్లాపల్లి మండలం రెమిడిచర్లలో జరిగిన ఈ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా, వారిలో హుస్సేన్ అనే కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

నేటి సాయంత్రం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సహా ఇతర టీడీపీ నేతలు గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని, అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు.

Telugudesam
Guntur
Nakka Anand Babu
GGH
Hussain
  • Loading...

More Telugu News