Lalu Prasad Yadav: లాలూ గుండె, మూత్ర పిండాలు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు!: డాక్టర్ డీకే ఝా వెల్లడి

  • గుండె 50 శాతం మాత్రమే పని చేస్తోంది
  • మూత్ర పిండాలు 85 శాతం పని చేస్తున్నాయి
  • హృదయ స్పందనలు సైతం సక్రమంగా లేవు

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు స్పందించారు. ప్రస్తుతం ఆయన గుండె, మూత్ర పిండాలు పూర్తి స్థాయిలో పని చేయడం లేదని వెల్లడించారు. అవినీతి ఆరోపణలపై జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రస్తుతం రాంచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్సనందుకుంటున్నారు.

 ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ డీకే ఝా మాట్లాడుతూ, ఆయన గుండె 50 శాతం మాత్రమే పని చేస్తోందని, ఆయన మూత్ర పిండాలు 85 శాతం పని చేస్తున్నాయని తెలిపారు. హృదయ స్పందనలు సైతం సక్రమంగా లేవన్నారు. షుగర్ కూడా బాగా పెరగడంతో ఆహారం విషయంలో నిబంధనలు విధించినట్టు తెలిపారు. రోజుకు 18 రకాల మందులు అందిస్తున్నామని, లాలూ ప్రస్తుతం మందులపైనే గడుపుతున్నారని డీకే ఝా వెల్లడించారు.

Lalu Prasad Yadav
Ranchi
DK Jha
Bihar
Heart beating
  • Loading...

More Telugu News