TRS: పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం!

  • స్వయంగా పనులను పర్యవేక్షించండి
  • ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరు కావాలి
  • భవనాల నమూనాలను కేసీఆర్ ఖరారు చేస్తారు

టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల శంకుస్థాపన ఈ నెల 24న జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రులు, జిల్లా చైర్‌పర్సన్లకు అప్పగించారు. తొమ్మిది జిల్లాల్లో మంత్రులు, మిగతా జిల్లాల్లో జడ్పీ చైర్ పర్సన్లు కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ మేరకు కేటీఆర్ నేడు ఫోన్ ద్వారా ఆయా నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎవరి జిల్లాకు వారు వెళ్లి స్వయంగా పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. శంకుస్థాపన కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలంతా హాజరు కావాలని కోరారు. పార్టీ అధినేత కేసీఆర్ కార్యాలయ భవనాల నమూనాలను ఖరారు చేస్తారని తెలిపారు. నిర్మాణానికి అవసరమైన నిధులు సహా అన్ని విధాలా పార్టీ సహకరిస్తుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణాలు పూర్తి కావాలని ఆదేశించారు.

TRS
KTR
Ministers
ZP Chairpersons
KCR
Building inaguration
  • Loading...

More Telugu News