Allu Arjun: రెండో వివాహం చేసుకున్న అల్లు అరవింద్ పెద్ద కుమారుడు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-e55c6869bce0507381e4ffd1632dbe121a226d68.jpeg)
- కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరు
- గతంలో నీలిమతో వివాహం
- విడాకుల తర్వాత నీలూ షాతో ప్రేమలో పడిన అల్లు బాబీ
ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో వివాహం చేసుకున్నారు. ముంబయికి చెందిన నీలూ షాతో ఆయన వివాహం హైదరాబాద్ లో నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.
కాగా, అల్లు బాబీకి గతంలో నీలిమ అనే యువతితో పెళ్లయింది. విభేదాల కారణంగా 2016లో ఇద్దరూ విడిపోయారు. వీరికి అన్విత అనే కుమార్తె ఉంది. విడాకుల అనంతరం బాబీ చాలాకాలం ఒంటరిగానే ఉన్నారు. అయితే నీలూ షాతో పరిచయం పెళ్లి వరకు వచ్చింది. నీలూ తండ్రి కమల్ కాంత్ ఓ వ్యాపారవేత్త. ముంబయిలో పుట్టిపెరిగిన నీలూ పూణేలో ఎంబీఏ పూర్తిచేసి యోగా శిక్షకురాలిగా కొనసాగుతున్నారు. తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ అనే ఫిట్ నెస్ స్టూడియో నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆమె తన మకాం ముంబయి నుంచి హైదరాబాద్ మార్చారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-d86a26ba9e9703f9fbd961eaab907678c165ddbb.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-7706823f0596aa852fd6a75cc0ea9178b731ce95.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-963e4ebc102aef00bd04a1373ed39025e0b9a6ad.jpg)