Jagan: ఏపీలో గ్రామ వలంటీర్ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం... నియమ నిబంధనలు ఇవిగో!

  • ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్
  • గ్రామ వలంటీర్ ఎంపిక నోటిఫికేషన్ జారీ
  • 50 శాతం మహిళలకు రిజర్వేషన్  

తాము అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలోనూ వలంటీర్లను నియమించి అన్ని ప్రభుత్వ పథకాలను ఇంటికే చేర్చుతామని ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో జగన్ సర్కారు ముందడుగు వేసింది. గ్రామ వలంటీర్ల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు విధివిధానాలతో రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ వలంటీర్ల నియామకాల్లో స్థానికులకు అధిక అవకాశాలతో పాటు, 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు.

అర్హతలు-నియామక షెడ్యూల్

  • దరఖాస్తుదారుడు అదే పంచాయతీలో నివసిస్తుండాలి 
  • ఓసీ కానివాళ్లు తమ కులధ్రువీకరణ పత్రం సమర్పించాలి
  • గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి విద్యార్హత
  • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్
  • పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ అర్హత
  • వయసు నిబంధన: 2019 జూన్ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి
  • దరఖాస్తుల స్వీకరణ: జూన్ 24 నుంచి జూలై 5 వరకు
  • దరఖాస్తుల స్క్రూటినీ: జూలై 10 నుంచి
  • ఇంటర్వ్యూలు: జూలై 11 నుంచి 25 వరకు
  • అప్పాయింట్ మెంట్ లెటర్స్ జారీ: ఆగస్టు 1న
  • ఎంపికైన గ్రామ వలంటీర్లకు ట్రయినింగ్: ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు.

  • Loading...

More Telugu News