Telangana: తెలంగాణ పోలీసులు బీజేపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నారు!: బీజేపీ ఎంపీ బండి సంజయ్

  • ఎన్నికల తర్వాత మాపై దాడులు పెరిగాయి
  • పోలీసులు టీఆర్ఎస్ నేతలకు వత్తాసు పలుకుతున్నారు
  • కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన లోక్ సభ సభ్యుడు

సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని కరీంనగర్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న యువకులు, విద్యార్థులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో పోలీసులు టీఆర్ఎస్ నేతలకే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదనీ, జాతీయ బీసీ కమిషన్ తో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Telangana
Karimnagar District
mp
bandi sanjay
BJP
Police
harassment
third degree
  • Loading...

More Telugu News