Srikakulam District: నేనైతే తొలి ప్రాధాన్యం క్రీడలకే ఇస్తాను!: ఏపీ మంత్రి కృష్ణదాస్‌

  • ఆరోగ్యకరమైన సమాజం కోసం క్రీడలను ప్రోత్సహించాలి
  • గత ప్రభుత్వాలు క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి
  • జగన్‌ ప్రభుత్వంతో క్రీడకారులకు మంచి రోజులు

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, ఒలింపిక్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ధర్మాన కృష్ణదాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ముఖ్యమంత్రి అయితే తొలి ప్రాధాన్యం క్రీడలకే’ అంటూ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో ఆయన ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తానే కనుక ముఖ్యమంత్రి అయితే తొలి ప్రాధాన్యం క్రీడలకే ఇచ్చేవాడినన్నారు.

ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే క్రీడలను ప్రోత్సహించాలని, కానీ గత ప్రభుత్వాలు క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ డైనమిక్‌ నాయకుడు అని, ఆయన హయాంలో క్రీడలకు మంచి రోజులు వస్తాయని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

Srikakulam District
R&B minister
dharmana krishnadas
sports
  • Loading...

More Telugu News