Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్!

  • న్యాయమూర్తి చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్
  • ఇప్పటివరకూ తాత్కాలిక సీజేగా బాధ్యతల నిర్వహణ
  • కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్, ఇతర ముఖ్యనేతలు

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ హైకోర్టు తాత్కాలిక సీజేగా వ్యవహరిస్తున్న జస్టిస్ రాఘవేంద్రను పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈరోజు జస్టిస్ రాఘవేంద్ర చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఆయన ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.బి.రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లడంతో జస్టిస్ రాఘవేంద్ర బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ రాఘవేంద్ర ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.

Telangana
High Court
chief justice
raghavendra chauhan
  • Error fetching data: Network response was not ok

More Telugu News