Telugudesam: నేను మాత్రం టీడీపీలోనే: టీజీ వెంకటేశ్ తనయుడు భరత్

  • బీజేపీలో చేరిన టీజీ వెంకటేశ్
  • తాను మాత్రం టీడీపీని వీడబోనన్న భరత్
  • లోకేశ్‌తో ఫోన్లో మాట్లాడానన్న టీజీ తనయుడు

తన తండ్రి బీజేపీలో చేరినా తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని టీజీ వెంకటేశ్ తనయుడు టీజీ భరత్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన భరత్.. తండ్రి వెంటే బీజేపీలో చేరుతారని అందరూ భావించారు. అయితే, తాను టీడీపీలోనే ఉంటానని, ఈ విషయాన్ని లోకేశ్‌కు కూడా ఫోన్ చేసి చెప్పానని భరత్ తెలిపారు. తన తండ్రి బీజేపీలో చేరడానికి ముందు తనతో ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు.

ఆయన బీజేపీలో చేరుతున్నా తానెక్కడ ఉండాలన్నది తన ఇష్టమని తండ్రి తనతో చెప్పినట్టు భరత్ పేర్కొన్నారు. ఆయన బీజేపీలో చేరిన వెంటనే తాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు ఫోన్ చేసి మాట్లాడానని, తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పానని అన్నారు. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చంద్రబాబు, లోకేశ్‌లను తాను కలుస్తానని వెంకటేశ్ పేర్కొన్నారు.

Telugudesam
BJp
TG Venkatesh
TG Bharath
Andhra Pradesh
  • Loading...

More Telugu News