Naveen patanaik: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జగన్నాథ స్వాములవారు.. నేను కూడా దేవుడినే: ఒడిశా మంత్రి

  • తనను తాను బతోడి తెగ దేవుడిగా అభివర్ణించుకున్న మంత్రి
  • మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
  • ఆయన మంత్రి పదవికి అనర్హుడన్న విపక్షాలు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను జగన్నాథస్వామిగా, తనను తాను ఓ దేవుడిగా అభివర్ణించుకున్న ఆ రాష్ట్ర మంత్రి సుదాం మరండిపై విమర్శల జడివాన కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవికి ఆయన అనర్హుడని, వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పూజారులు బరిపడ నుంచి భువనేశ్వర్‌లోని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి సుదాం మరండి మాట్లాడుతూ.. పాదయాత్ర విరమించాలని కోరారు. సీఎం నవీన్ పట్నాయక్ స్వయంగా జగన్నాథస్వామి వారని, తానేమో బతోడి తెగ పూజించే బాదామ్ దేవుడినని  చెప్పుకొచ్చారు.  

మంత్రి వ్యాఖ్యలపై అర్చకులు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను స్వామి వారే శిక్షిస్తారని  హరిబల్‌దేవ్ జ్యూ టెంపుల్‌కు చెందిన కామేశ్వర్ త్రిపాఠీ, అరుణ్ మిశ్రాలు అన్నారు. మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ చంద్ర మహాపాత్ర విమర్శించారు.  

Naveen patanaik
Odisha
Lord Jagannath
  • Loading...

More Telugu News