Somu Veerraju: ఏపీకి ఎంతో చేశాం.. కానీ ప్రజలు మాకు ఓట్లేయలేదు: సోము వీర్రాజు

  • అనేక పార్టీల నేతలు మాకు టచ్‌లో ఉన్నారు
  • నలుగురి చేరిక ఆరంభం మాత్రమే
  • ప్రజలు మెచ్చే పద్ధతిలోనే పార్టీ బలోపేతం

తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని సోము వీర్రాజు తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరడం కేవలం ఆరంభం మాత్రమేనన్నారు.

ఒకప్పుడు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేసి, పంతం పట్టి గడ్డం పెంచిన వారే(సీఎం రమేశ్) నేడు బీజేపీలో చేరతామని కోరారని తెలిపారు. ఏపీ కోసం ఎంతో చేశామని కానీ ప్రజలు మాత్రం తమకు ఓట్లేయలేదన్నారు. అందుకే తాము ప్రజలు మెచ్చే పద్ధతిలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. 2024లో అధికారం తమదేనని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.

Somu Veerraju
Rajyasabha Members
CM Ramesh
BJP
Telugu States
  • Loading...

More Telugu News