Chandrababu: టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వ్యాఖ్యలు

  • లోకేశ్ చేష్టలు భరించలేకపోయారు
  • చంద్రబాబు వయసు పైబడుతోంది
  • త్వరలోనే జైలుకెళ్లడం తథ్యం

ఏపీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా టీడీపీలో ఏర్పడ్డ రాజకీయ కల్లోలంపై స్పందించారు. నలుగురు ఎంపీలు టీడీపీని వీడి బీజేపీలో చేరడానికి అసలు కారణం లోకేశ్ అని వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవహారాలు, కార్యకలాపాల్లో లోకేశ్ చేష్టలు సహించలేక ఎంపీలు పార్టీని వీడారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఎంతో అవినీతికి పాల్పడ్డాడని అంజాద్ బాషా విమర్శించారు. త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లడం తథ్యంగా కనిపిస్తోందని అన్నారు. ఇకనైనా చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని, ఆయన వయసు కూడా పైబడిపోతోందని వ్యాఖ్యానించారు.

Chandrababu
Nara Lokesh
YSRCP
Amzad Basha
Kadapa
  • Loading...

More Telugu News