Rajasingh: రాజాసింగ్‌పై దాడి ఘటనకు సంబంధించిన మొదటి వీడియోను విడుదల చేయాలి: లక్ష్మణ్ డిమాండ్

  • రాజాసింగ్‌పై దాడి టీఆర్ఎస్ దౌర్జన్యాలకు పరాకాష్ట
  • జేపీ నడ్డాకు తెలంగాణలోని పరిస్థితులను వివరించా
  • త్వరలో అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దాడి ఘటనకు సంబంధించిన మొదటి వీడియోను విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ దౌర్జన్యాలకు పరాకాష్టే రాజాసింగ్‌పై దాడి అని పేర్కొన్నారు. అధికార పార్టీ బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. జేపీ నడ్డాకు తెలంగాణలోని తాజా పరిస్థితులను వివరించినట్టు పేర్కొన్నారు. త్వరలో బీజేపీలోకి అన్ని పార్టీల నుంచి చేరికలుంటాయని ఆయన స్పష్టం చేశారు.

Rajasingh
TRS
BJP
Lakshman
JP Nadda
Telangana
  • Loading...

More Telugu News