Andhra Pradesh: వెంకయ్యనాయుడిని కలిసిన టీడీపీ ఎంపీలు

  • రాజ్యసభలో టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ లేఖ 
  • ఆ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని వినతి
  • వెంకయ్యను కలిసిన వారిలో గల్లా, కేశినేని తదితరులు

రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని టీడీపీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కలిశారు. రాజ్యసభలో టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ ఆయనకు ఓ లేఖ సమర్పించారు. టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం ఫిరాయింపుల కిందకే వస్తుందని ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. వెంకయ్యనాయుడిని కలిసిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి ఉన్నారు.

Andhra Pradesh
Telugudesam
mp`s
galla
Kesineni Nani
  • Loading...

More Telugu News