Venkaiah Naidu: విలీనానికి ఆమోదముద్ర వేసిన వెంకయ్యనాయుడు!... రాజ్యసభ వెబ్ సైట్లో బీజేపీ జాబితాలో ఆ నలుగురి పేర్లు!

  • టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు సభ్యులు
  • విలీనం కుదరదని వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు
  • తన పరిధిలో నిర్ణయం తీసుకున్న వెంకయ్యనాయుడు

సాంకేతికంగా చూస్తే విలీనం చెల్లదని, విలీనం చేసే అధికారం రాజ్యసభ చైర్మన్ కు లేదని టీడీపీ నేతలు ఎన్ని భాష్యాలు చెప్పినా వాటన్నింటినీ పక్కనబెట్టి రాజ్యసభలో బీజేపీలో టీడీపీ విలీనానికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదముద్ర వేశారు. టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల పేర్లు రాజ్యసభ వెబ్ సైట్లో బీజేపీ సభ్యుల జాబితాలో కనిపించడమే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో, అదే వెబ్ సైట్లో టీడీపీ సభ్యులుగా ఇద్దరే కనిపిస్తున్నారు. కనకమేడల రవీంద్రకుమార్, సీతారామలక్ష్మి మాత్రమే టీడీపీ సభ్యులుగా సదరు వెబ్ సైట్ పేర్కొంది. టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు బీజేపీ జాబితాలో ఉన్నారు.

Venkaiah Naidu
Telugudesam
Rajya Sabha
  • Loading...

More Telugu News