Andhra Pradesh: ఏపీ దేవాలయాల్లో అర్చకులకు 25 శాతం పారితోషికం పెంపు

  • దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి బాధ్యతల స్వీకరణ
  • అర్చకుల పారితోషికం పెంపు ఫైల్ పై సంతకం
  • అర్హులైన అర్చకులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలిస్తాం: మంత్రి

ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సంబంధిత అధికారులు ఆయన్ని అభినందించారు. ఆలయాల్లో అర్చకులకు 25 శాతం పారితోషికం పెంచుతూ తొలి ఫైల్ పై ఆయన సంతకం చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, అర్హులైన అర్చకులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని హామీ చెప్పారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూముల పరిరక్షణకు, దేవాదాయ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామని చెప్పారు.

Andhra Pradesh
devadaya
minister
vellampalli
  • Loading...

More Telugu News