East Godavari District: నిన్నటి కాకినాడ మీటింగ్ పై అనుమానాలొద్దు: టీడీపీ నేత వేదవ్యాస్

  • మంచీచెడూ మాట్లాడుకోవడం కోసమే భేటీ అయ్యాం
  • నిన్నటి సమావేశం రహస్యం కాదు
  • మా పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించాం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టీడీపీకి చెందిన కాపు నేతల సమావేశం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. టీడీపీ కాపు నేతలు పార్టీని వీడతారన్న వదంతులు వ్యాపించాయి. ఈ వదంతుల నేపథ్యంలో టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ స్పందించారు. నిన్నటి కాకినాడ మీటింగ్ పై అనుమానాలొద్దని, మంచి చెడులు మాట్లాడుకోవడం కోసమే భేటీ అయ్యామని స్పష్టం చేశారు. నిన్నటి సమావేశం రహస్యం కాదని, ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి గల కారణాలపైన, తమ ఓటమికి జనసేన పార్టీ ప్రభావంపైన చర్చించినట్టు తెలిపారు.

East Godavari District
kakinada
Telugudesam
veda vyas
  • Loading...

More Telugu News