Chandrababu: చంద్రబాబుకు రాజకీయాల పట్ల పెద్దగా అవగాహన లేదు: జీవీఎల్

  • ఈ విషయం మొన్నటి ఎన్నికల ద్వారా తెలిసింది
  • బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పా
  • నా వ్యాఖ్యలపై టీడీపీ నేతలకు నమ్మకం కుదర్లేదు

ఏపీలో టీడీపీ దారుణమైన ఫలితాలు ఎదుర్కొంటుందని ఎన్నికలకు ముందు తాను చెప్పినట్టుగానే జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు రాజకీయాల పట్ల పెద్దగా అవగాహన లేదన్న విషయం ఈ ఎన్నికల ద్వారా తెలిసిందని వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అప్పుడు చెప్పామని, ఆ వ్యాఖ్యలపై టీడీపీ నేతలకు నమ్మకం కుదరలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.

Chandrababu
Telugudesam
bjp
gvl
mp
  • Loading...

More Telugu News