Andhra Pradesh: తీహార్ జైలుకు పోకుండా ఉండేందుకే సుజనా బీజేపీలో చేరాడు!: టీడీపీ నేత వర్ల రామయ్య

  • సుజనా బ్యాంకులను నిండా ముంచేశాడు
  • చంద్రబాబును ఉపయోగించుకుని లబ్ధి పొందారు
  • వీళ్లంతా పార్టీ మారుతారని మాకు ముందే తెలుసు

సుజనా చౌదరి బ్యాంకులను నిండా ముంచేశారనీ, ఇప్పుడు తీహార్ జైలుకు పోకుండా ఉండేందుకే బీజేపీలో చేరారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. సుజనా, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ లు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతారని తమకు ముందే తెలుసని వ్యాఖ్యానించారు. వీరంతా టీడీపీని, చంద్రబాబును ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదిగారని ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్ల రామయ్య మాట్లాడారు.

టీడీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ బీజేపీలో చేరరని వర్లరామయ్య స్పష్టం చేశారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి ఇద్దరూ ఇద్దరేనని దుయ్యబట్టారు. తీహార్ జైలు కంటే బీజేపీలో చేరడమే బెటర్ అని ఈ నేతలు భావించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పుడు నలుగురు నేతలు దొంగ దెబ్బ కొట్టారనీ, ఇందుకు అంతకంత అనుభవిస్తారని విమర్శించారు. సుజనా బ్యాంకులను కొల్లగొట్టారనీ, సీబీఐ దగ్గర ఇందుకు సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఏక పార్టీ వ్యవస్థ దేశానికి పెనుముప్పు అని హెచ్చరించారు.

Andhra Pradesh
tihar
Telugudesam
Sujana Chowdary
varla ramaioah
  • Loading...

More Telugu News