Andhra Pradesh: కోడెల శివరామ్ మా భూమిని ఆక్రమించారు.. పోలీసులకు 16 మంది రైతుల ఫిర్యాదు!

  • గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఘటన
  • ధూళిపాళ్ల గ్రామంలో 17.52 ఎకరాల దురాక్రమణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వెన్నాదేవి గ్రామ రైతులు

టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్ పై కేసుల పర్వం కొనసాగుతోంది. తాజాగా  సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామానికి చెందిన 16 మంది రైతులు కోడెల శివరామ్, ఆయన పీఏ గుత్తా నాగప్రసాద్ పై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ధూళిపాళ్ల గ్రామంలో తమ అందరికీ కలిపి 17.52 ఎకరాల భూమి ఉండగా, దాన్ని కొడెల కుమారుడు శివరామ్ ఆక్రమించుకున్నాడని బాధితులు తెలిపారు.

ముత్తాతల నుంచి ఈ భూమి తమకు సంక్రమించిందని చెప్పారు. అయితే ఈ భూమిపై కోడెల కుమారుడి కన్ను పడటంతో తమను వేధించడం ప్రారంభించారని వాపోయారు. ఈ భూమిని కోడెల శివరామ్ ఆక్రమించుకున్నారనీ, తమ భూమిని వెంటనే వెనక్కి ఇప్పించాలని పోలీసులను కోరారు. కాగా, ఈ వ్యవహారంలో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.

  • Loading...

More Telugu News