Andhra Pradesh: ఏపీ రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజుపై తిరుగుబాటు.. అజయ్ కల్లంతో భేటీకానున్న ఉద్యోగులు!

  • బొప్పరాజుపై రెవెన్యూ ఉద్యోగుల ఆగ్రహం
  • తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపాటు
  • గుంటూరులోని రెవెన్యూ భవన్ లో వ్యతిరేకవర్గం భేటీ

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు గుంటూరు జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్ లో బొప్పరాజు వ్యతిరేక వర్గం సమావేశం అయింది. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా, ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న బొప్పరాజుపై ఏపీ మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

Andhra Pradesh
revenue employees
ajay kallam
boppa raju
rebels
rivals
  • Loading...

More Telugu News