Kerala: యోగాతో ఏ మతానికీ సంబంధం లేదు.. కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు!: కేరళ సీఎం విజయన్

  • యోగా ఆసనాలతో ఏ మతానికి సంబంధం లేదు
  • జీవనశైలి రోగాలకు యోగానే పరిష్కారం
  • తిరువనంతపురంలో యోగా వేడుకల్లో పాల్గొన్న సీఎం

యోగా విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. యోగా ఓ మతానికి సంబంధించిన విషయమని మరికొందరు ఆరోపణలు కూడా చేశారని తెలిపారు. యోగాలో భాగంగా వేసే ఆసనాలు ఏ మతానికి చెందినవి కావని స్పష్టం చేశారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయన్ పాల్గొన్నారు.

మన జీవనశైలి కారణంగా ఇప్పుడు అనేక రోగాలు వస్తున్నాయని విజయన్ అన్నారు. యోగా కారణంగా మన శరీరానికి కావాల్సిన వ్యాయామం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. యోగాను కుల,మతాలకు అతీతంగా ఎవరైనా సాధన చేయవచ్చని స్పష్టం చేశారు.

Kerala
international yoga day
pinaraye vijayan
Chief Minister
  • Loading...

More Telugu News