Andhra Pradesh: విజయవాడలో కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా!

  • భర్త సెల్వమణితో కలిసి గృహప్రవేశం
  • రాజధానికి దగ్గరగా ఉండేలా ఇల్లు
  • నగరి నుంచి రెండోసారి గెలిచిన రోజా

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా ఇటీవల విజయవాడలో ఇల్లు తీసుకున్నారు. తాజాగా ఆమె భర్త సెల్వమణితో కలిసి గృహప్రవేశం చేశారు. ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజధానికి దగ్గరగా రోజా దంపతులు తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రోజా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నగరిలోనే ఇంటిని నిర్మించుకున్నారు. తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె నగరి నుంచి ఘనవిజయం సాధించారు.

మరోవైపు నవరత్నాలను సమర్థవంతంగా అమలు అయ్యేలా చూసే బాధ్యతను సీఎం జగన్ రోజాకు అప్పగించే అవకాశముందని భావిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మితో కలిసి రోజా ఈ పథకాలను పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

Andhra Pradesh
roja
YSRCP
new home
house warming cermony
  • Loading...

More Telugu News