Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం.. మానవ ఇంజనీరింగ్ మేధకు ఓ మచ్చుతునక!: అక్కినేని నాగార్జున

  • నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
  • ట్విట్టర్ లో ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగార్జున
  • నేడు ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న కేసీఆర్

తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈరోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ విషయమై స్పందించారు.

‘నీరే జీవనానికి ఆధారం. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం. మానవ ఇంజనీరింగ్ మేధకు ఓ మచ్చుతునక. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎం కార్యాలయాన్ని ఇందుకు ట్యాగ్ చేశారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు.

Telangana
kaleswaram project
akkineni nagarjuna
praise
Twitter
  • Loading...

More Telugu News