Road Accident: దర్గాకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

  • ఎనిమిది మందితో వెళుతున్న ఆటోను ఢీకొట్టిన లారీ
  • చిల్కూరు మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఘటన
  • మృతులంతా మహబూబాబాద్‌ జిల్లా వాసులు

ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా వారి జీవితాలు తెల్లారి పోయాయి. దర్గాకు వెళ్లి ఆటోలో వస్తున్న వారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు...మహబూబాబాద్‌ జిల్లా కొరరి మండలం చింతపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సూర్యాపేట జిల్లా జాంపహాడ్‌లోని దర్గాను దర్శించుకునేందుకు ఈరోజు ఉదయం ఆటోలో వెళ్లారు.

 దర్గాలో ప్రార్థనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆటోలో వస్తుండగా చిల్కూరు మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దగ్గరలోని స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Road Accident
Suryapet District
mits college
Mahabubabad District
four died
  • Loading...

More Telugu News