Sujana Chowdary: సుజనా చౌదరి వ్యాఖ్యలు హాస్యాస్పదం: టీడీపీ నేత గద్దె రామ్మోహన్

  • రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీని వీడారట
  • ప్రజా క్షేత్రంలో బలం లేని నేతలను తీసుకుంటోంది
  • ఇలాంటి నేతల ద్వారా బీజేపీ ఏం ఆశిస్తోందో?

టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఎంపీలపై తెలుగు దేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే పార్టీ మారిన వారిపై టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమ, బుద్ధా వెంకన్నలు ధ్వజమెత్తారు. తాజాగా, గద్దె రామ్మోహన్ రావు స్పందిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ నుంచి బయటకు వెళ్లామన్న సుజనా చౌదరి వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. ప్రజా క్షేత్రంలో బలం లేని నేతలను బీజేపీలోకి తీసుకోవడం ద్వారా ఆ పార్టీ ఏం ఆశిస్తోందో అర్థం కావట్లేదని అన్నారు.

Sujana Chowdary
bjp
Telugudesam
Gadde Rammohan
  • Loading...

More Telugu News