Telugudesam: పార్టీని వీడిన ఎంపీలపై టీడీపీ నేతల మండిపాటు.. జీవీఎల్, విజయసాయిరెడ్డిలపై బుద్ధా వెంకన్న ప్రశంసలు!

  • ఈ ఎంపీలు పిరికిపందల్లా వ్యవహరించారు: దేవినేని
  • పార్టీ మారిన ఎంపీలు చచ్చు దద్దమ్మలు
  • నమ్ముకున్న పార్టీల కోసం జీవీఎల్, విజయసాయిరెడ్డి నిలబడ్డారు: బుద్ధా  

టీడీపీని వదిలి బీజేపీలో చేరిన ఎంపీలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎంపీలు చచ్చు దద్దమ్మలని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ జీవీఎల్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి నేతలు తాము నమ్ముకున్న పార్టీ కోసం నిలబడ్డారని ప్రశంసించారు. అధికారంలో లేకుండా వీరు నెల రోజులు కూడా పార్టీలో ఉండలేకపోయారని వారిపై ధ్వజమెత్తారు.

ఇదే విషయమై టీడీపీ మరో నేత దేవినేని ఉమ మాట్లాడుతూ, పార్టీ ఎన్నో సంక్షోభాలు చూసిందని, ఈ ఎంపీలు మాత్రం పిరికిపందల్లా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఐడీ, ఈడీ కేసులకు భయపడి ఈ ఎంపీలు పార్టీని వీడారని, బీజేపీ కండువాలు కప్పుకున్నారని తూర్పారబట్టారు.

Telugudesam
devineni uma
buddha venkanna
bjp
  • Loading...

More Telugu News