Telugudesam: నాకు రాజకీయ గురువు చంద్రబాబునాయుడే: సుజనా చౌదరి

  • నాకు రాజకీయ ఓనమాలు నేర్పించింది చంద్రబాబు
  • గౌరవం తగ్గిందనో, ఇంకోటనో పార్టీ మారలేదు
  • టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను కష్టపడ్డా

‘నాకు రాజకీయ గురువు చంద్రబాబే’ అని టీడీపీని విడిచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి చెప్పారు. ఢిల్లీలో బీజేపీలో చేరిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు రాజకీయ ఓనమాలు నేర్పించింది బాబు అని చెప్పారు. టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం తగ్గిందని ఆ పార్టీపై అభాండాలు వేయట్లేదని అన్నారు.

టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్ నేతలు పార్టీని వీడారన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. గతంలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను ఎంతగానో కష్టపడ్డానని, ఆ విషయం చంద్రబాబునాయుడికి కూడా తెలుసని అన్నారు. టీడీపీని విడిచి బీజేపీలోకి రమ్మనమని తాను ఎవరికీ చెప్పలేదని, అలా చెప్పడం కూడా తప్పని అన్నారు. ఎవరి ఇష్ట ప్రకారం వారు చేస్తారని చెప్పారు.

ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు కరెక్టు కాదని, ఈ భూ ప్రపంచంలో తనపై ఎటువంటి ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులు, చార్జీ షీట్లు లేవని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వ్యాపార ప్రయోజనాలను ఆశించి తాను పార్టీ మారానన్నది కరెక్టు కాదని, 2004లో తన వ్యాపారాల నుంచి బయటకు వచ్చిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు.

Telugudesam
Chandrababu
bjp
Sujana Chowdary
delhi
  • Loading...

More Telugu News