Kakinada: టీడీపీ ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు కూడా బీజేపీలోకి రాబోతున్నారు: విష్ణువర్ధన్‌రెడ్డి

  • చంద్రబాబు అస్త్ర సన్యాసం చేసి విదేశాలకు వెళ్లారు
  • కాపు సమావేశాలు మరెన్నో జరుగుతాయి
  • మరో వారం రోజుల్లో ఏం జరుగుతుందో చూస్తారు
  • ఇక ఏపీలో టీడీపీ ముగిసిన అధ్యాయం

మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణువర్థన్‌రెడ్డి ఓ ఛానల్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అస్త్ర సన్యాసం చేసి విదేశాలకు వెళ్లారని విమర్శించారు.

కాకినాడ వంటి కాపు సమావేశాలు మరెన్నో జరుగుతాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో 2/3వ వంతు మంది, అలాగే టీడీపీ లోక్‌సభ సభ్యులు కూడా బీజేపీలోకి రాబోతున్నారంటూ పెను సంచలనానికి తెరదీశారు. రాయలసీమకు చెందిన కొన్ని టీడీపీ కుటుంబాలు కూడా తమ పార్టీతో టచ్‌లో ఉన్నాయని, ఏపీలో ఇక టీడీపీ ముగిసిన అధ్యాయమని విష్ణువర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ చేతుల్లో ఉన్నంత కాలం ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.

Kakinada
Andhra Pradesh
Vishnu Vardhan Reddy
Telugudesam
Rayalaseema
Chandrababu
Nara Lokesh
Balakrishna
  • Loading...

More Telugu News