Andhra Pradesh: మాతృ సంస్థకు తిరిగి వచ్చినట్టుగా ఉంది: బీజేపీలో చేరిన టీజీ వెంకటేశ్

  • ప్రజలు మోదీ, బీజేపీని కోరుకుంటున్నారు
  • అందుకే, ప్రజల వెంటే వెళ్లాలని నిర్ణయించుకున్నాం
  • రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తా

బీజేపీ ప్రభుత్వం, మోదీ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, అందుకే, తాము కూడా ప్రజల వెంటే వెళ్లాలని నిర్ణయించుకున్నామని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో వెంకటేశ్ మాట్లాడుతూ, గతంలో తాను రాయలసీమలో ఏబీవీపీ నాయకుడిగా, రాష్ట్ర యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను బీజేపీలో చేరడం ద్వారా మాతృసంస్థకు తిరిగి వచ్చిన భావన కలుగుతోందని చెప్పారు. రాయలసీమ ప్రాంతం బాగా వెనుకబడిందని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

Andhra Pradesh
Telugudesam
tg venkatesh
bjp
jp nadda
  • Loading...

More Telugu News