Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోరప్రమాదం... బస్సు లోయలో పడి 20 మంది దుర్మరణం

  • మలుపు తిరిగే క్రమంలో అదుపుతప్పిన బస్సు
  • 200 మీటర్ల లోయలో పడిన వైనం
  • క్షతగాత్రులను బయటికి తీసిన స్థానికులు, పోలీసులు

హిమాచల్ ప్రదేశ్ లో ఈ సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ప్రయివేటు బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 20 మంది మృతి చెందారు. కులు జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న బస్సు మలుపు తిరిగే ప్రయత్నంలో అదుపుతప్పి 200 మీటర్ల లోయలో పడిపోయింది. బంజర్ బస్టాండ్ దాటి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన అనంతరం బస్సు ప్రమాదానికి గురైంది.

కాగా, క్షతగాత్రుల పరిస్థితి సైతం విషమంగా ఉందని కులు జిల్లా ఎస్పీ షాలిని అగ్నిహోత్రి తెలిపారు. స్థానికుల సహకారంతో పోలీసులు సహాయచర్యలు చేపట్టినట్టు చెప్పారు.

Himachal Pradesh
Bus
Road Accident
Gorge
Kullu
  • Loading...

More Telugu News