Andhra Pradesh: ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటుందని ఆశిస్తున్నా: జేపీ నడ్డా

  • బీజేపీలో చేరిన ముగ్గురు టీడీపీ ఎంపీలు
  • ఏపీ అభివృద్ధి కోసం వారు మా పార్టీలో చేరారు
  • బీజేపీ సానుకూల రాజకీయాలతో ముందుకెళ్తోంది

టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ముగ్గురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధి కోసమే వారు తమ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నాయకత్వం తమకు నచ్చిందని చెప్పారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలతో ముందుకెళ్తోందని, టీడీపీ నేతల చేరికతో ఏపీలో బీజేపీ బలం పుంజుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

Andhra Pradesh
Telugudesam
bjp
jp nadda
  • Loading...

More Telugu News