komatireddy: నాయకత్వ లక్షణాలు లేని ఆయన తప్పుకుంటేనే కాంగ్రెస్ బాగుపడుతుంది: కోమటిరెడ్డి రాజగోపాల్

  • ఉత్తమ్ కు నాయకత్వ లక్షణాలు లేవు
  • కేసీఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు
  • టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం

తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉత్తమ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారని ఆయన ఆరోపించారు. పీసీసీ పదవి నుంచి ఆయన తప్పుకుంటేనే రాష్ట్రంలో కాంగ్రెస్ బాగుపడుతుందని అన్నారు. గ్రూపులను ప్రోత్సహించి పార్టీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.

చంద్రబాబు ప్రచారం చేయడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైందని కోమటిరెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో ఉత్తమ్ ఎవరినీ కలుపుకుపోలేదని అన్నారు. ఉత్తమ్ కు నయకత్వ లక్షణాలే లేవని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలు, అనుచరులతో చర్చించి... భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News